అక్షరటుడే, వెబ్డెస్క్ : Power Cuts | కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణ అంధకారమవుతుందని కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన చెప్పినట్లే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు చీకట్లోకి నెట్టారని విమర్శించారు.
గోదావరిఖనిలో సింగరేణి (Singareni) కార్మిక గర్జన సభలో బుధవారం కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్ కట్ (Power Cuts) సాధారణమైందన్నారు. పంటలకు నీరు అందక రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్పారు. సింగరేణి నష్టాల బాటలో ఉందని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Power Cuts | ప్రైవేట్ పరం చేసే కుట్ర
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఆగమైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. సింగరేణిలో సీఎం బావమరిది పెత్తనం నడుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదని విమర్శించారు. సింగరేణిలో ఇంత దోపిడీ జరుగుతుంటే కేంద్రంలో ఉన్న బొగ్గు శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
సింగరేణి ఉద్యమాల గడ్డ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెసోళ్ల అవినీతి, అణచివేత భరించలేక ఒకనాడు తుపాకులతో తిరగబడ్డది ఈ కోల్ బెల్ట్ అని గుర్తు చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలన్నారు.
రేవంత్ రెడ్డికి సిగ్గుందా, సోయి ఉందా?
నల్గొండ దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే, అక్కడ బొగ్గు లేదు కదా అక్కడెందుకు పెట్టారు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు
మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడలో, కడపలో ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారు? అక్కడ బొగ్గు ఉందా?
బొగ్గు ఉన్న ప్రాంతంలో అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే, ఇంకో దగ్గర నుండి అయినా పవర్ బ్యాకప్ ఉండాలని బొగ్గు లేని దగ్గర కూడా పవర్ ప్లాంట్ పెడతారు
సింగరేణిలో G9, G10 ఉత్పత్తి చేసే బొగ్గు గనులు 13 ఉన్నాయి కానీ ఒక్కటి లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు
రేవంత్ రెడ్డికి ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి