అక్షరటుడే, వెబ్డెస్క్ : Ghatkesar CI Suspension | మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ సీఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.
ఘట్కేసర్ (Ghatkesar) సీఐ బాలస్వామిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా ఆయన సివిల్ వ్యవహారాల్లో తలదూర్చినట్లు సమాచారం. కొండాపూర్లో ఓ భూ వివాదం కేసు, మరో యువతి ఆత్మహత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనపై ఫిర్యాదులు రావడంతో సీపీ సుమతి విచారణకు ఆదేశించారు.
Ghatkesar CI Suspension | విచారణలో తేలడంతో..
ఉన్నతాధికారుల విచారణలో సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. దీంతో మల్కాజ్గిరి సీపీ సుమతి సీఐ బాలస్వామని సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Car Accident | హైదరాబాద్లో కారు బీభత్సం