Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సస్పెన్షన్

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సురేష్​ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yadadri Power Station | ఎల్​నినో నేపథ్యంలో విద్యుత్​ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ బి సురేష్​ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ మేరకు ఉత్పత్తి చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)సైతం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) దామరచర్లలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ బి. సురేష్‌ను టీజీ జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్ సస్పెండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణల రావడంతో చర్యలు తీసుకున్నారు.

Yadadri Power Station | ఇన్​ఛార్జుల నియమాకం

యాదాద్రి థర్మల్ ప్లాంట్​లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారులను ఇన్​ఛార్జీలుగా నియమించింది. ఐఏఎస్​ అధికారులు చెవ్వూరి హరికిరణ్​, వెంకటేశ్​ దోత్రే, రాహుల్ రాజ్​, హనుమంత్​ కొండిబ, శివకుమార్​ నాయుడును ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ నెల 15 నుంచి 30 వరకు రోజుకు ఒక్కరు (కేటాయించిన తేదీల్లో) ప్లాంట్​ను సందర్శించాలి. విద్యుత్​ ఉత్పత్తి, బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇది కూడా చదవండి..: Telangana Weather Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *