Nizamabad GGH Medical Equipment | ఐవోసీ ఆధ్వర్యంలో జీజీహెచ్​కు వైద్య పరికరాల అందజేత

నిజామాబాద్​ నగరంలోని జీజీహెచ్​లో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఐవోసీ ముందుకొచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Nizamabad GGH Medical Equipment | నగరంలోని(Nizamabad) జీజీహెచ్​లో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఐవోసీ ముందుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పథకం కింద, ‘నిర్మాణ్ ఆర్గనైజేషన్’ సహకారంతో సుమారు రూ. 65 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆస్పత్రికి సమకూర్చింది.

Nizamabad GGH Medical Equipment | వైద్యుల పర్యవేక్షణలో..

​పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జనరల్ మెడిసిన్ విభాగం అధిపతి జలగం తిరుపతిరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పరికరాలు సీఎస్ఆర్ పథకం ద్వారా మంజూరయ్యాయి. గురువారం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ (ఆర్థోవోటీ) లేబర్ రూమ్‌లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పరికరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. కృష్ణ మోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు అధికారికంగా ప్రారంభించారు. ఈ నిధులు మంజూరయ్యేలా కృషి చేసిన మాజీ సూపరింటెండెంట్ డా. పి. శ్రీనివాస్, ప్రొఫెసర్ డా. జలగం తిరుపతిరావుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది.

​Nizamabad GGH Medical Equipment | సమకూరిన వైద్య పరికరాలివే..

మూడు ​వెంటిలేటర్లు, 3 ​బబుల్ సీపాప్ (Bubble CPAP), 1 సీ-ఆర్మ్ (C-Arm) యంత్రం, 5 ​సీఆర్ (CR) క్యాసెట్లు, 10 ​సిరంజి పంపులు, 6 ప్రసవ పట్టికలు (Delivery Tables), 2 ​కార్డియోటోకోగ్రఫీ (CTG) యంత్రాలు ఉన్నాయి. ​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కృష్ణ మోహన్, సూపరింటెండెంట్ రాములు మాట్లాడుతూ.. ఈ పరికరాల అందుబాటుతో శస్త్రచికిత్సలు, ప్రసూతి సేవలు, నవజాత శిశువుల అత్యవసర సంరక్షణ మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందుతాయని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికై సీఎస్ఆర్ నిధులు అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి రవికిరణ్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి శ్రీకాంత్, ప్రసూతి విభాగం ప్రొఫెసర్లు లక్ష్మీ ప్రసన్న, అరుణ రేఖ, ఈఎన్టీ విభాగాధిపతి సునీల్, అనస్తీషియా విభాగాధిపతి రవి నాగ ప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, డెర్మటాలజీ విభాగాధిపతి రమణ మోహన్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్. చంద్రకళతో పాటు నర్సింగ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: రైతు బీమా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *