Armoor RTC Special Bus Fares | ‘స్పెషల్’ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ..!

పండగలు వచ్చిందంటే చాలు ఆర్టీసీ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే ఆర్మూర్ : Armoor RTC Special Bus Fares | పండగలు వచ్చిందంటే చాలు ఆర్టీసీ ప్రయాణికులను (TGSRTC) నిలువు దోపిడీ చేస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తూ  ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Armoor RTC Special Bus Fares | స్టిక్కర్​ వేసి అడ్డగోలుగా..

ఆర్మూర్(Armoor)​ బస్టాండ్​లో రెగ్యులర్​గా తిరిగే బస్సులకే ‘స్పెషల్’ అని స్టిక్కర్​ వేసి ఇష్టారాజ్యంగా ఛార్జీలు దండుకుంటున్నారని ప్రయాణికులు తెలిపారు. ఎక్స్​ప్రెస్​, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులకు స్పెషల్ అంటూ స్టిక్కర్లు తగిలించి రెండింతలు డబ్బులు వసూలు చేస్తున్నారని వారు వాపోయారు. జేబీఎస్ నుంచి ఆర్మూర్​కు రూ. 310 ఉండగా పండగ వేల ప్రత్యేక బస్సులు అంటూ రూ. 410 అదనంగా వసూలు చేస్తున్నారని. ఇలా ప్రతి బస్సుపై స్పెషల్ పేరుతో రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. మరోవైపు ఎక్స్ ప్రెస్ బస్సులకు స్పెషల్ బోర్డులు తగిలించారని పేర్కొన్నారు. ఈ బస్సులో మహాలక్ష్మి కార్డు(Mahalakshmi Scheme) చెల్లుబాటు కాకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వారన్నారు. అసలు మహాలక్ష్మి టికెట్​తో ప్రయాణించడానికి బస్సు సర్వీసులే వేయకపోవడంతో మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరలు మారుతాయా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *