క్రైంSon Attack Father | తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు..

Son Attack Father | తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు..

తండ్రీకొడుకుల మధ్య ఏర్పడిన చిన్న వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటన మోస్రా మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

అక్షరటుడే, బాన్సువాడ: Son Attack Father | తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన చిన్న వివాదంలో ఘర్షణ ఏర్పడింది. ఇది చివరకు హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటన మోస్రా (Mosra) మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకోగా స్థానికంగా కలకలం రేపింది.

Son Attack Father | మోస్రా మండలంలో..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా మండలానికి చెందిన ముస్తఫా (తండ్రి), అతని కుమారుడు అమాన్ మధ్య కొంతకాలంగా కుటుంబ సంబంధిత విషయాలపై విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ముస్తఫాకు భార్యతో గొడవ జరిగింది. తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొడుకు అమాన్​ అడ్డువచ్చాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తుడైన అమాన్​.. ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ముస్తఫాకు తీవ్రమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, పొరుగువారు గాయపడిన ముస్తఫాను నిజామాబాద్‌లోని (Nizamabad) ఓ ఆస్పత్రికి (Nizamabad) తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు (varni Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Crematorium Development | స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలియదు..: మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Crematorium Development | పట్టణంలో శ్మశాన వాటికల...

Punjab Assembly Controversy | పంజాబ్ అసెంబ్లీలో ‘మద్యం’ కలకలం.. సీఎం తాగొచ్చారని ప్రతిపక్షాల ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Punjab Assembly Controversy | కార్మిక దినోత్సవం...

Nanded Tiruchanur Train | నాందేడ్​ – తిరుచానూరు రైలు క్రమబద్ధీకరణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nanded Tiruchanur Train | వేసవి సెలవుల...

TG Organics App | ప్రభుత్వం గుడ్​న్యూస్.. యాప్​లో సేంద్రియ ఉత్పత్తులు కొనొచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Organics App | ప్రస్తుతం సేంద్రియ...