Water Supply Priority | తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

ఎల్​నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/భీమ్​గల్​ : Water Supply Priority | ఎల్​నినో ప్రభావంతో (El Nino Impact) జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి(P Sudarshan Reddy) వెల్లడించారు. భీమ్​గల్(Bheemgal)​ తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Water Supply Priority | రైతులకు పలు సూచనలు..

రైతులకు సుదర్శన్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు సైతం గణనీయంగా పడిపోతున్నాయని, మున్ముందు పంటల సాగుకు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్​లో సమృద్ధిగా సాగు జలాలు అందించామని, పూర్తిస్థాయిలో కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఎల్​నినో వల్ల తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన ఆవశ్యకత నెలకొనిందని తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత యాసంగిలో వరి పంట వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. వరి వేసుకుంటే సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, పప్పు దినుసు పంటల వైపు దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, భీమ్​గల్​ మున్సిపల్ ఛైర్​పర్సన్​ నాగమణి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహశీల్దార్ కిరణ్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, స్థానిక రైతులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఫాస్ట్ రోప్ ప్రదర్శనలో ప్రమాదం.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *