Bathukamma Immersion | మొబైల్స్​ వెలుగుల్లో బతుకమ్మ నిమజ్జనం.. ఏర్పాట్ల తీరుపై మహిళల అసహనం!

కామారెడ్డి పెద్దచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bathukamma Immersion | కామారెడ్డి (Kamareddy) పెద్దచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. చెరువుకు వెళ్లేదారిలో లైట్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.

Bathukamma Immersion | అసహనం వ్యక్తం చేస్తూ..

సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం రాత్రి వేలాదిగా మహిళలు చెరువు వద్దకు చేరుకుంటుండగా.. నిమజ్జనం జరిగే ప్రధాన ప్రాంతంలో కనీసం లైట్లు లేకపోవడంతో మహిళలు ఫోన్ లైట్స్ వెలుతురులో నిమజ్జనానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఫొటోలు దిగే చోటనే లైట్లు ఏర్పాటు చేశారని, నిజంగా మహిళలు నిమజ్జనం చేసే దారిలో, చెరువు వద్ద చీకటే రాజ్యమేలిందని ప్రజలు మండిపడ్డారు.

Bathukamma Immersion | బతుకమ్మలు ఓ చేతితో.. మరో చేతితో ఫోన్​ టార్చ్​లైట్​..

బతుకమ్మలు పట్టుకుని నడుస్తున్న మహిళలు, చిన్న పిల్లలు ఫోన్ టార్చ్ లైట్లతో దారి చూసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. పెద్దఎత్తున జరిగే బతుకమ్మ నిమజ్జనం కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు.. కేవలం ప్రచారం కోసమే లైట్లు పెట్టారని, భద్రత, వెలుతురు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో జారుడుగా ఉన్న ప్రాంతంలో నిమజ్జనం చేయడం ప్రమాదకరంగా మారిందని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

567855

ఇది కూడా చదవండి: ఎన్​హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం  

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *