అక్షరటుడే, వెబ్డెస్క్ : Mysore Dasara Festival | కర్ణాటకలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.
మైసూరులో ప్రతి యేటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వేడుకలను ప్రారంభించారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి, డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.
Mysore Dasara Festival | అమ్మవారికి ప్రత్యేక పూజలు
మైసూరు రాజభవనం వద్ద నిర్వహించిన ఈ దసరా వేడుకల్లో పాల్గొనడానికి ముందు సీఎం మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను పలువురు సన్మానించారు.
ఇది కూడా చదవండి : Indian Roller Bird | పాలపిట్టలను రక్షించిన అధికారులు