Bigala Ganesh Gupta | ఘనంగా మాజీఎమ్మెల్యే బిగాల అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం

అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అమ్మమ్మ 100వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ : Bigala Ganesh Gupta | అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (Ganesh Gupta) అమ్మమ్మ 100వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Bigala Ganesh Gupta | ఆమె జీవితం మాకు స్ఫూర్తిదాయకం..

బిగాల గణేష్​ గుప్తా మాట్లాడుతూ.. తన అమ్మమ్మ గందె కళావతి 100వ జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆమె శతాబ్దపు జీవన ప్రయాణం అనేది ఎంతో గొప్ప విషయమన్నారు. వందేళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. అమ్మమ్మ తన జీవిత ప్రయాణంలో కుటుంబ సభ్యులకు అందించిన ప్రేమ, ఆప్యాయతలు, విలువలు, ఆశీర్వాదాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో అమ్మమ్మ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, ఆమె ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Tree Plantation | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *