అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Telangana Police Sports Meet 2026 | పోలీస్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya)పేర్కొన్నారు. నవంబర్‌లో జరుగనున్న గేమ్స్ మీట్ ముగింపు ఏర్పాట్లపై సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
Telangana Police Sports Meet 2026 | ట్రాక్‌ల ఏర్పాటు..
స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహించనున్న క్రీడా పోటీలకు అవసరమైన ట్రాక్‌ల ఏర్పాటు, క్రీడా మైదానాలను సిద్ధం చేయడం , క్రీడాకారులకు వసతి సౌకర్యాలపై సీపీ సమీక్షించారు. వైద్య సేవలు, తాగునీటి సరఫరా, భోజన ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు.
Telangana Police Sports Meet 2026 | ఆరోగ్య భద్రత కోసం..
క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వైద్య సిబ్బంది, ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
Telangana Police Sports Meet 2026 | పోటీలు జరిగే ప్రాంతాలివే..
స్పోర్ట్స్ మీట్‌ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ( జాన్కంపేట్), అలీ సాగర్, నాగారం గ్రౌండ్, కాలూరు రోడ్డు, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్, ముప్కాల్ ఆర్చరీ అకాడమీ మొదలగు ప్రాంతాలలో నిర్వహిస్తామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణ, నరేందర్, గురు నాయుడు, మస్తాన్ అలీ, డీవైఎస్వో పవన్ కుమార్, ఆర్చరీ కోచ్ రవీందర్, స్విమ్మింగ్ కోచ్ మహిపాల్ రెడ్డి, అథ్లెటిక్స్ సెక్రెటరీ రాజా గౌడ్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ విజయ్ కాంత్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం..! పోలీసుల అదుపులో నిందితులు..?