Sweet Shop Inspections | స్వీట్ షాప్​లలో అపరిశుభ్రత.. నోటీసులిచ్చిన ఫుడ్​ సేఫ్టీ అధికారులు

స్పెషల్ డ్రైవ్​లో భాగంగా ఫుడ్​సేఫ్టీ అధికారులు భిక్కనూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Sweet Shop Inspections | స్పెషల్ డ్రైవ్​లో భాగంగా ఫుడ్​సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటీవల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు (Bhikkanoor) మండల కేంద్రంలోని పలు స్వీట్ షాపుల్లో గురువారం ఫుడ్​సేఫ్టీ (Food Safety Officials) అధికారి విక్రమ్ తనిఖీలు నిర్వహించారు.

Sweet Shop Inspections | గడువు తీరిన పదార్థాల ధ్వంసం..

తనిఖీల్లో భాగంగా కొన్ని దుకాణాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. గడువు తీరిన పదార్థాలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉన్న దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.

ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశంలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు. ఆహార పదార్థాలను తయారు చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, గ్లౌజులు, క్యాప్ వాడాలని, వంటగది, సామగ్రి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఆంజనేయస్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *