అక్షరటుడే, వెబ్డెస్క్: Shamshabad Airport Currency Seizure | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల వద్ద మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Shamshabad Airport Currency Seizure | ఇద్దరు ప్రయాణికుల వద్ద..
తాజా సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్‌ఐ అధికారులు ఇద్దరు ప్రయాణికుల వద్ద ఉన్న విదేశీ కరెన్సీని గుర్తించారు. వారిలో ఒక ప్రయాణికుడి వద్ద రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించగా, మరో ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కరెన్సీ విలువ రూ.1,55,56,000గా ఉంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని తరలించేందుకు గల కారణాలు, దానికి సంబంధించిన అనుమతులు, పత్రాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.