అక్షరటుడే, వెబ్డెస్క్: Elephant Electrocuted | తిరుపతి-చిత్తూరు (Tirupati-Chittoor) జిల్లాల సరిహద్దుల్లోని ఇరాల మండలం చుక్క వారి పల్లి గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఏనుగు మృతి చెందింది. శనివారం ఉదయం తన పొలంలో అడవి ఏనుగు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటంతో రైతు ఆందోళనకు గురయ్యారు.
Elephant Electrocuted | తక్కువ ఎత్తులో విద్యుత్ లైన్లు
ఆ రైతు ఏనుగు చనిపోయిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనల ప్రకారం, ఆ ప్రాంతంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న హై-టెన్షన్ విద్యుత్ తీగలను తాకడం వల్ల ఏనుగు విద్యుదాఘాతానికి గురై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: AP Municipal Elections | ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!