TGPSC Exam Centre Inspection | టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TGPSC Exam Centre Inspection | జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో ఏవీ ఎంటర్ ప్రైజెస్ సెంటర్​ను కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం అసిస్టెంట్ సైంటిస్ట్​ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) పోస్టుల భర్తీ కోసం సీబీటీ విధానంలో ఎగ్జామ్ నిర్వహించగా పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

TGPSC Exam Centre Inspection | అభ్యర్థుల హాజరు గురించి ఆరా..

పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను కలెక్టర్​ నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అనేది గమనించారు. బయోమెట్రిక్ హాజరు సేకరణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.  పరీక్షా కేంద్రంలోని ఆయా గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. ఈనెల 26న జరగనున్న పరీక్షలను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఐఈవో రవికుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Sriram Sagar Project | కరువుకోరల్లో శ్రీరాంసాగరం.. ఎల్​నినో ఎఫెక్ట్​తో అయోమయంలో రైతన్న

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *