El Nino Monitoring Committee | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: El Nino Monitoring Committee | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

El Nino Monitoring Committee | లోటు వర్షపాతం..

జిల్లాలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం లోటు ఏర్పడి కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. ఈ కమిటీకి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, జిల్లా వ్యవసాయ అధికారిని మెంబర్ కన్వీనర్‌గా, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి, మిషన్ భగీరథ సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

El Nino Monitoring Committee | కరువు పరిస్థితులపై నిరంతర సమీక్ష..

కరువు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఈ కమిటీ దృష్టిసారిస్తుందన్నారు. వర్షపాతం లోటు, భూగర్భ జలాల స్థితిగతులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ప్రతివారం సమీక్షించడం చేస్తారన్నారు.ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, సంబంధిత శాఖల ద్వారా కరువు నివారణ చర్యల అమలును పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Paramedical Courses | ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సులకు 60 సీట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *