అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Essay Competition | జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Police Essay Competition | కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్సై వరకు..
కానిస్టేబుల్ నుండి ఏఎస్సై స్థాయి వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ‘వ్యాస రచన పోటీలు’ నిర్వహించారు. తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఉదయం నుండి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలను ఆశిస్తారు’ అంశంపై పోటీలు నిర్వహించారు. ఎస్సై ఆపై స్థాయి వరకు ‘పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయాల్సిన కృషి’పై అంశంపై పోటీలు జరిగాయి.
ఇది కూడా చదవండి: లగ్జరీ కార్లతో కలరింగ్.. మహిళా పోలీసులే టార్గెట్!