Drought Prevention | మూడు మండలాల్లో కరువు నివారణకు చర్యలు : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలోని మూడు మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drought Prevention | రాష్ట్రంలోని మూడు మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కరువు సమయంలో ప్రజలు, రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రూ.150 కోట్లతో మూడు మండలాల్లో ప్రత్యేక ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టామని చెప్పారు.

Drought Prevention | ఈ మండలాలు ఎంపిక

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల, నారాయణపేట జిల్లా మక్తల్ మండలాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌డీఎఫ్) సహకారంతో ఆయా మండలాల్లో కరువు నివారణ చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.

Drought Prevention | ఏం చేస్తారంటే..

ఈ ప్రాజెక్ట్​లో భాగంగా ఆయా మండల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేస్తారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ తయారు చేస్తారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ, కరువు పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రైతు కుటుంబాల జీవనోపాధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. నిధుల వినియోగం, పనుల అమలు, క్షేత్రస్థాయి ఫలితాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని మంత్రి స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : Rahul Gandhi Gen Z | ఆ లెక్కన నేను కూడా జెన్-జీ నే.. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ సెటైర్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *