Hydroponic Cannabis Seizure | లగేజీ బ్యాగ్​ అడుగున గంజాయి.. సీజ్​ చేసిన అధికారులు

విశాఖపట్నంలోని భోగపురం విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydroponic Cannabis Seizure | విశాఖపట్నంలోని భోగాపురం విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానంతో తనిఖీ చేయగా.. అతడి లగేజీ బ్యాగ్​లో 4.210 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

నిందితుడు బ్యాంకాక్‌లో గంజాయి కొనుగోలు చేసి, సింగపూర్ మీదుగా విశాఖపట్నం వచ్చాడు. సాధారణ తనిఖీల సమయంలో అతడి ప్రవర్తనపై అధికారులకు అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి బ్యాగ్​ అడుగున మరో అర ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు దానిని తొలగించి చూడగా.. అడుగున కవర్లలో హైడ్రోఫోనిక్​ గంజాయి ఉంది. దీంతో దానిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.

Hydroponic Cannabis Seizure | భారీ డిమాండ్​

హైడ్రోపోనిక్ గంజాయిని మట్టికి బదులుగా పోషకాలు అధికంగా ఉన్న నీటిని ఉపయోగించి నియంత్రిత వాతావరణంలో సాగు చేస్తారు. ఇది విలువైన రకం, కావడంతో మార్కెట్​లో డిమాండ్​ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి భారత్​కు తరచూ హైడ్రోఫోనిక్​ గంజాయి తీసుకు వస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులకు సంబంధించిన ఇలాంటి స్వాధీనాలు ఇతర విమానాశ్రయాల్లో కూడా నమోదయ్యాయి.

దీనిని కూడా చదవండి : TG SAFE Inspections | స్వీట్​ షాపులు, బేకరీల్లో టీజీ సేఫ్​ అధికారుల తనిఖీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *