అక్షరటుడే, కామారెడ్డి: Armed Reserve Police | ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాన్ని ఎస్పీ పరిశీలించారు.
Armed Reserve Police | పరేడ్ మైదానంలో..
పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాన్ని తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది పరేడ్‌ను పరిశీలించి క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం ఆయుధాగారం, స్టోర్‌ను తనిఖీ చేసి ఆయుధాల వినియోగం, భద్రత, నిర్వహణ విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాంబు స్క్వాడ్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్ అనుమానాస్పద వస్తువులను గుర్తించే విధానాన్ని తిలకించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలోని వివిధ విభాగాల ఫైళ్లు, రికార్డులను తనిఖీ చేసి వాటిని ఎప్పటికప్పుడు నవీకరిస్తూ క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రికార్డుల సక్రమ నిర్వహణ పోలీసు శాఖ పనితీరుకు ప్రతిబింబమని తెలిపారు.
Armed Reserve Police | ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో..
ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా ప్రశాంత వాతావరణంలో కొనసాగడంలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నిరంతర విధి నిర్వహణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని గుర్తించి రివార్డులు అందజేస్తామని తెలిపారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ సంతోష్‌తో పాటు కృష్ణ, నవీన్‌లను అభినందించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కృష్ణ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: El Nino Nizamabad | ఎల్‌నినోపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి