అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bhupathi Reddy Arvind Remarks | ఎంపీ అర్వింద్ (MP arvind) మోదీ ఇంటి భిక్షాటన ముందు చేస్తే బాగుండేదని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నగరంలో(Nizamabad) ఆయన విలేకరులతో మాట్లాడారు.
Bhupathi Reddy Arvind Remarks | పార్లమెంట్ ముందు భిక్షాటన చేయాలి..
ఎంపీ అర్వింద్ భిక్షాటన చేయాలంటే మోడీ ఇంటి ముందు, పార్లమెంట్ ముందు చేయాల్సిందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆయన భిక్షాటన చేస్తే బాగుండేదన్నారు. నిజామాబాద్ మాధవనగర్ ఆర్వోబీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని.. ఇది తెలిసి ఎక్కడ క్రెడిట్ కాంగ్రెస్ వాళ్లకు వెళ్తుందేమోనని ఆగమేఘాల మీద నిరసన దీక్ష చేయడాన్ని ప్రజలు చూశారన్నారు.
Bhupathi Reddy Arvind Remarks | పసుపు బోర్డుపై చర్చకు సిద్ధం
పసుపు బోర్డుపై ఓపెన్ డిబేట్‌కు తాను సిద్ధమని ఎంపీ అర్వింద్‌కు భూపతిరెడ్డి సవాల్ విసిరారు. అన్ని ఆధారాలతో పసుపు బోర్డు కార్యాలయానికి తాను వస్తానన్నారు. పసుపు బోర్డు తేవడం అనేది బోర్డు తగిలించడం కాదని.. బోర్డుతో రైతులకు కలిగిన ఉపయోగాన్ని తెలపాలన్నారు. ఆ పసుపు బోర్డు ఆఫీస్‌ను మేమే అద్దెకిచ్చామన్నారు. దమ్ముంటే 8 మంది ఎంపీలు కేంద్రానికి రావాల్సిన నిధుల కోసం కొట్లాడాలని సూచించారు. అంతేకానీ రోడ్లపై భిక్షాటన చేస్తే ఏమస్తుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఉర్దు అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ ర్యాలీకి సౌత్ నేతలు వెళ్లకుండా కుట్ర -TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్