అక్షరటుడే, ఇందూరు: Brain Stroke Treatment | బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చినప్పుడు సత్వర చికిత్సతో ప్రాణాలను రక్షించవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ మోసీన్ పేర్కొన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం (World Stroke Day) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో (Medicover Hospitals) ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Brain Stroke Treatment | లక్షణాలు, నివారణపై అవగాహన..
ఈ సందర్భంగా మోసిన్ మాట్లాడుతూ.. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం చిట్లడం వల్ల స్ట్రోక్ వస్తుందని తెలిపారు. ముఖం వంగిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, నడవడంలో ఇబ్బంది దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని సూచించారు. సకాలంలో ఆసుపత్రికి చేరితే ప్రాణాపాయం, దీర్ఘకాలిక వైకల్యం తప్పుతాయన్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం వల్ల స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని చెప్పారు. మంచి ఆహారం, వ్యాయామం, ఆరోగ్య నియంత్రణతో దీనిని నివారించవచ్చని తెలిపారు. నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లో 24 గంటల అత్యవసర సేవలు, ఆధునిక న్యూరో చికిత్సలు, పునరావాస సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఇది కూడా చదవండి: కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం