అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు చేపడుతుంది. ఇటీవల అక్రమ నీటి దందాపై కొరఢా ఝుళిపించిన హైడ్రా తాజాగా.. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఆర్.కె.పురం చెరువు (ముక్కిడికుంట) మినీ ట్యాంక్‌బండ్‌గా పేరుగాంచింది. అయితే కొందరు ఈ చెరువును కబ్జా చేసేందుకు యత్నించారు. ఈ మేరకు ఫిర్యాదులు అందడటంతో హైడ్రా రంగంలోకి దిగింది. గురువారం 12 ఎకరాల మేర ఆక్రమణలను తొలగించి కంచె వేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే కొందరు ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించుకున్నారు. కంచెలు వేసుకుని తలా కొంత అని చెరువు స్థలాన్ని పంచుకున్నారు.
HYDRAA | చెరువులోకి వ్యర్థాలు..
ఆక్రమణలకు పాల్పడిన వారు ఆ స్థలాన్ని కబేలాలుగా వినియోగించారు. ఆ వ్యర్థాలను చెరువులో పారబోస్తున్నారు. దీంతో హైడ్రా సిబ్బంది గురువారం ప్రికాస్ట్ వాల్స్‌తో వేసిన ప్రహరీలను తొలగించారు. భవిష్యత్‌లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా.. ఎఫ్టీఎల్ పరిధి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కాగా ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 75 ఎకరాలు కాగా.. ఇప్పటికే 11 ఎకరాలు ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. మరో 12 ఎకరాలు ఆక్రమించే యత్నం చేయగా.. హైడ్రా అడ్డుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో