Engineering Students Death | పోలీసులను చూసి భయంతో పరుగు.. కరెంట్​ షాక్​తో విద్యార్థుల మృతి

కరెంట్​ షాక్​తో ఇద్దరు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన మొయినాబాద్​లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering Students Death | కరెంట్​ షాక్​తో ఇద్దరు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మొయినాబాద్​లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

మొయినాబాద్​ సమీపంలో కేజీ రెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీ ఉంది. శుక్రవారం కళాశాలలో ఫెస్ట్ నిర్వహించారు. ఇంజినీరింగ్​ కాలేజీలో ఫెస్ట్​ అంటే పండుగలాంటి వాతావరణం ఉంటుంది. ఈ క్రమంలో దాదాపు 10 మంది విద్యార్థులు కాలేజీ విద్యార్థులు సాయంత్రం వేళ మద్యం తాగడానికి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు.

Engineering Students Death | పోలీసులు రావడంతో..

కేజీ రెడ్డి కాలేజీ గ్రామానికి దూరంగా పొలాల మధ్యలో ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు మద్యం తాగుతుండగా.. పోలీసులు పెట్రోలింగ్​ వాహనంతో వచ్చారు. ఆందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే రాజిరెడ్డి అనే రైతు తన పొలంలోకి అడవి జంతువులు రాకుండా చుట్టూ కరెంట్​ తీగలు పెట్టాడు. విద్యార్థులు ఆ వైర్​ను గమనించకుండా పరుగులు తీయగా.. షాక్​ కొట్టి ఇద్దరు చనిపోయారు. మృతి చెందిన విద్యార్థులను యశ్వంత్, మోక్షా చరణ్​గా గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad egg racket | గర్ల్స్​ హాస్టల్ ముసుగులో ‘అండాల అక్రమ దందా’.. పోలీసుల దాడిలో షాకింగ్​ నిజాలు బట్టబయలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *