Public Governance Meeting | ప్రజలు, ప్రభుత్వానికి అధికారులు వారధిగా నిలవాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Public Governance Meeting | ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజాభివృద్ధికి కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (mla dhanpal) అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్​లో (Sri Rama Garden) నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు.

Public Governance Meeting | సమన్వయంతో పనిచేస్తూ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్​పాల్​ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థలో అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలోనే నిజామాబాద్​ను (Nizamabad) మొదటి స్థానంలో నిలపాలన్నారు. ప్రజలు చెప్పే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే శాఖాపరంగా ఏదైనా సమస్యలు వస్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితనం మెరుగుపడాలని, ప్రతి శాఖాధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.

Public Governance Meeting | బెల్ట్​ షాప్​లను కట్టడి చేయాలి

ఆబ్కారీ శాఖ (Excise Department) బెల్ట్ షాపులను కట్టడి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలామంది మద్యానికి బానిసలై విలువైన ఇతలను నాశనం చేసుకుంటున్నాన్నారు. విద్యాశాఖపరంగా పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. నగరంలో అనేక అంగన్​వాడీ కేంద్రాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని, వాటిని సొంత భవనంలోకి మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమమైన నామమాత్రంగా కాకుండా.. ప్రజలకు మేలు కలిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము, శ్రావణ్ కుమార్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

4332

ఇది కూడా చదవండి : IPL 2026 Second Half | ఐపీఎల్‌లో ఉత్కంఠ రేపుతున్న సెకండాఫ్‌.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *