Rajagopal Reddy Comments | పైసలు ఇస్తేనే పనులు..​ ప్రభుత్వంపై రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy Comments | సొంత ప్రభుత్వం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంలచన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ పాలనలో పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు కొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పైసలు లేనిదే పనులు చేయడం లేదన్నారు.

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సైలెంట్​ అయిన ఆయన మరోసారి విమర్శలు ఎక్కుపెట్టడం గమనార్హం. గట్టుప్పల్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Rajagopal Reddy Comments | నిధులు ఇవ్వడం లేదు

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను అయిన తాను కూడా నిధుల కోసం ప్రతిపక్షంలా పోరాడాల్సి వస్తోందని మండిపడ్డారు. మంత్రి పదవి ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు మనసు చంపుకుని వెళ్లినా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి నిధులు తేలేనప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగడం దండగ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.

Rajagopal Reddy Comments | ప్రభుత్వం విఫలమైంది

రైతుబంధు, బెల్టు షాపుల నిర్మూలన వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో బెల్టుషాపుల నిర్మూలన చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. అయితే తన నియోజకవర్గంలో మాత్రం బెల్టుషాపులను నిర్మూలిస్తున్నామని వెల్లడించారు. రైతుబంధు గురించి గ్రామాల్లో రైతులు అడుగుతున్నారని.. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాలు, నాయకులు, వ్యవస్థ మారితేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

ఇది కూడా చదవండి..: Murasu Cyclone | తుపాన్​ ఎఫెక్ట్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *