Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు నిబంధనలు పాటించాలి : సీపీ సాయిచైతన్య

క్రాకర్స్ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా పాలిటెక్నిక్ క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, హోల్​సేల్ షాపుల యాజమాన్యాలతో సీపీ కార్యాలయంలో పోలీస్​ కమిషనర్​ సమావేశం నిర్వహించారు.

Firecracker Sales Rules | లైసెన్స్​లు పొందిన తర్వాతే..

పోలీస్ కమిషనర్ (CP Sai Chaitanya) మాట్లాడుతూ బాణసంచా విక్రయాలు నిర్వహించే ప్రతి షాపు యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సంబంధిత శాఖల నుంచి అవసరమైన లైసెన్సులు పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని స్పష్టం చేశారు. షాపుల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు నిర్వహించినా.. భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత షాపు యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Firecracker Sales Rules | తప్పనిసరిగా ఉండాల్సినవి..

లైసెన్స్ కాపీ దుకాణం ముందు కనిపించేలా ఉండాలన్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలు, 2 ఇసుక బకెట్లు , 2 నీటి బకెట్లు ఉండాలని సూచించారు. దుకాణంలో పొగ తాగడం, అగ్గిపుల్ల, లైటర్ వెలిగించడం, వంట చేయడం పూర్తిగా నిషేధమని సీపీ స్పష్టం చేశారు. 18ఏళ్లలోపు పిల్లలకు బాణాసంచా అమ్మకూడదన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు దుకాణం మూసివేయాలని..దుకాణం దగ్గర టపాసులు కాల్చి చూపించకూడదని పేర్కొన్నారు. ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ సత్యనారాయణ,రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్–1 ఎస్హెచ్​వో శ్రీనివాస్, రెండోటౌన్ ఎస్సై యాదగిరి గౌడ్, మూడో టౌన్​ ఎస్సై హరిబాబు, నాల్గో టౌన్ ఎస్సై–2 సాయన్న, ఐదోటౌన్ ఎస్సై సునీల్, పాలిటెక్నిక్ క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేట సంతోష్, సెక్రెటరీ పసుమర్తి ప్రవీణ్, క్యాషియర్ బొంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Rice Price Regulations | అధిక ధరకు బియ్యం అమ్మితే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *