అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal Helicopter Crash | నేపాల్లో ల్యాండ్ అవుతుండగా.. రెండు హెలీకాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని భారత్కు చెందిన వసంత్కుమార్గా పోలీసులు గుర్తించారు.
నేపాల్ (Nepal)లోని మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో ఎత్తైన విమానయాన కేంద్రంలో ల్యాండ్ అవుతుండగా హెలీకాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు రెండు హెలికాప్టర్ల రోటర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం అవి కింద కూలిపోయాయి. దీంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Nepal Helicopter Crash | విస్తృతంగా వినియోగం
హిమాలయ దేశమైన నేపాల్లో హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తారు. పర్యాటకులు, పర్వతారోహకులు, సామగ్రిని రవాణా చేయడానికి, అత్యవసర తరలింపులు చేపట్టడానికి చిన్న హెలికాప్టర్లను వాడతారు. కొండ ప్రాంతాలు ఉండటంతో ఎక్కువగా చిన్న హెలికాప్టర్ సేవలను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Delhi Green Crackers | దీపావళి బాణసంచాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..