ACB Trap | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన యువజన క్రీడల అధికారి

మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి పైసలు అడుగుతున్నారు. లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీకి పట్టుబడుతున్నా.. కఠిన చర్యలు లేకపోవడంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. తాజాగా ఓ మహబూబ్​నగర్​ యువజన, క్రీడల అధికారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.

మహబూబ్‌నగర్ (Mahabub Nagar) జిల్లా యువజన, క్రీడల అధికారి (DY&SO) జక్కు రాజశేఖర్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్​ చేశాడు. పట్టణంలోని ఎస్​ఏటీజీ వాలీబాల్ హాస్టల్‌లో బస చేస్తున్న క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్​కు ఆగస్టు 2026 నెలకు పెండింగ్‌లో ఉన్న క్యాటరింగ్ బిల్లులను ప్రాసెస్ చేసి ఆమోదించడం, క్యాటరింగ్ బిల్లు రూ.3,10,000 చెక్కు విడుదల చేయడం కోసం ఏకంగా రూ.లక్ష లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ACB Trap | ఇద్దరి అరెస్ట్​

డీవైఎస్​వో రాజశేఖర్​ రెడ్డి కార్యాలయంలో పని చేసే టైపిస్ట్​ గోరే ఉమేష్ ద్వారా గురువారం రూ.లక్ష లంచం తీసుకున్నాడు. అనంతరం దానిని అధికారికి అప్పగించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *