RTC Bus Accident | అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు,కారు.. తప్పిన పెనుప్రమాదం

ఆర్టీసీ బస్సు కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లాయి.

shashi kiran Mottala

అక్షరటుడే గాంధారి: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటన గాంధారి మండలంలోని గుడిమెట్​ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

RTC Bus Accident | బస్సులో 16మంది ప్రయాణికులు..

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి (Kamareddy) నుండి 16మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బాన్సువాడ వైపు బయలుదేరింది. అయితే గుడిమెట్ శివారు ప్రాంతంలోకి రాగానే బస్సు వెనకాలే వస్తున్న మరో కారు బస్సును ఓవర్​టేక్​ చేయబోగా ఈ హడావుడిలో రెండు వాహనాలు రోడ్డుకిందికి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులను బస్సులోనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ చేయాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Khilla Raghunath Temple Fire | ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *