Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

కీసర పోలీస్​ స్టేషన్​ ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Keesara SI Bribery | మల్కాజ్​గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్​ స్టేషన్​ ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్​ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా అతడిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి నిందితుడిపై దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, వెంటనే ఛార్జిషీట్లు దాఖలు చేయడం కోసం ఎస్సై శ్రీనివాస్​ లంచం డిమాండ్​ చేశాడు. రూ.2 లక్షలు ఇస్తే కేసు దర్యాప్తులో సహకరిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి సోమవారం రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా.. ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

Keesara SI Bribery | అవినీతి కేంద్రంగా ఠాణా

కీసర పోలీస్ స్టేషన్​ అవినీతి కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఠాణాలో పని చేసే సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షలు తీసుకుంటూ సెప్టెంబర్​ 16న దొరికారు. వారిని అధికారులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం సీఐ ఆంజనేయులు ఇళ్లలో సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. సరూర్‌నగర్‌లోని లింగోజిగూడలో రెండు ప్లాట్లు, ఎల్.బి. నగర్‌లోని మన్సూరాబాద్, సి.ఆర్. ఎన్‌క్లేవ్‌లో ఇల్లు, పెరూర్‌ గ్రామంలో ఒక ఇల్లు, మిర్యాల్‌గూడలోని హాలియాలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఠాణాలో సీఐ, ఎస్సై చిక్కి రెండు నెలలు కూడా కాకముందే మరో ఎస్సై లంచం తీసుకుంటూ దొరికిపోవడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Alisagar Water Sports | అలీసాగర్​లో వాటర్​ స్పోర్ట్స్​ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *