Hyderabad Water Supply | తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు

హైదరాబాద్​ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కొనసాగుతున్న పనులను జలమండలి (HMWSSB) ఎండీ అశోక్​రెడ్డి, అధికారులు బుధవారం పరిశీలించారు.

ఎల్​నినో నేపథ్యంలో వర్షాలు లేక నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో నీటినిల్వలు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో జలమండలి ట్యాంకర్లకు ఇప్పుడే డిమాండ్​ పెరిగింది. వేసవిలో నీటి కొరత తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ప్రత్యామ్నాయ నీటి తరలింపు కోసం పనులు చేపడుతున్నారు. నగరానికి ప్రధాన జలవనరులైన సింగూరు-మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో ఇతర మార్గాల ద్వారా నీరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Hyderabad Water Supply | గండిపేట చెరువు పరీశీలన

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్​లను పరిశీలించారు. నగరానికి అదనపు తాగునీటిని సరఫరా చేసే సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి అవసరాలు పెరుగుతాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చు, ఏ మార్గాల్లో తరలించవచ్చు అని అధికారులతో చర్చించారు. వేసవిలో తాగునీటి డిమాండ్ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Kulgam Terror Attack | జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *