Salura Sarpanch Protest | అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన సాలూర మండల సర్పంచు​లు!

సాలూర మండలంలోని సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Salura Sarpanch Protest | నిజామాబాద్​ జిల్లా సాలూర (salura) మండలంలోని సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు. తమ గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదని వారు గుర్రుగా ఉన్నారు.

Salura Sarpanch Protest | ప్రమాణస్వీకారం బహిష్కరణ..

ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి పాల్గొన్న సాలూర సొసైటీ ఛైర్మన్​ ప్రమాణస్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. అలాగే పింఛన్ల కార్యక్రమానిక సైతం వారు గైర్హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్తే తమకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సాలూరు మండలంపై బోధన్ మండల నాయకుల పెత్తనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రొటోకాల్​ పాటించట్లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న సర్పంచు​లు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. సాలూరు మండలంలో 12 మంది సర్పంచులు ఉండగా 11 మంది అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటీ..? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *