అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sajjanar Controversy | హైదరాబాద్ (Hyderabad) నగర మాజీ కమిషర్ వీసీ సజ్జనార్‌పై రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్‌ను బదిలీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. సజ్జనార్‌ను ఆయన ‘యూనిఫాం ధరించిన నేరస్థుడు’గా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Sajjanar Controversy | బాధ కలిగిస్తోంది
వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను హైదరాబాద్ సీపీ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. నూతన సీపీగా మహేశ్ భగయత్కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు స్పందిస్తూ.. ఒకప్పటి సహోద్యోగిని ‘యూనిఫాం ధరించిన నేరస్థుడు’ అని విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. కానీ ఇది వాస్తవం అన్నారు. వ్యక్తిగత సాన్నిహిత్యం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమైనవి, తప్పును తప్పు అని చెప్పక తప్పదన్నారు.
Sajjanar Controversy | విచారణ జరపాలి
బదిలీ అనేది శిక్ష కాదని, అది చేసిన నేరాలను తుడిచిపెట్టలేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. సజ్జనార్ పాల్పడిన అన్ని నేరపూరిత కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే ఈ వ్యవస్థలోని అక్రమాలను, అవినీతిని పూర్తిగా తొలగించడం సాధ్యమవుతుందన్నారు. ఆయన ట్వీట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం