Ponnam Prabhakar Counter | రాహుల్​ పర్యటన.. కేటీఆర్​కు మంత్రి పొన్నం కౌంటర్​

రాహుల్​ గాంధీ పర్యటనపై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్​ కౌంటర్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponnam Prabhakar Counter | భారత్​ సమ్మిట్​లో పాల్గొనేందుకు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్​ వస్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్​ఎస్​ నాయకులు రాహుల్​ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.

రాహుల్​ పర్యటన నేపథ్యంలో బీఆర్​ఎస్​ పార్టీ ఇప్పటికే ర్యాప్​ సాంగ్​ను విడుదల చేసింది. ఆరు గ్యారంటీలు, హామీలపై ప్రశ్నిస్తూ పాడిన పాటను సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు కేటీఆర్​ సైతం రాహుల్​ పర్యటనపై విమర్శలు చేశారు. ఆయన ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్​ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్​ కౌంటర్​ ఇచ్చారు.

Ponnam Prabhakar Counter | కేటీఆర్​కు అంత సీన్​ లేదు

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్​కు లేదని పొన్నం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్ హయాంలో నేరెళ్ల దళితుల దాడి, ఖమ్మంలో రైతులకు బేడీలు, మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీ ఛార్జి చేశారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారా అన్నారు. తాము మాత్రం గ్రూప్​–1 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బీఆర్​ఎస్​ నేతల్లాగా వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద తమకు ఆసక్తి లేదన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. అవినీతి గురించి కేటీర్ మాట్లాడటం అంటే వింతగా ఉందన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని కేటీఆర్​, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు.. అసైన్ ల్యాండ్ లు .. ఇలా చెప్పుకుంటూ పోతే.. వారి అవినీతిలెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుందన్నారు.

ఇది కూడా చదవండి..: KTR Criticism | రాహుల్​గాంధీ పర్యటనపై కేటీఆర్​ విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *