Gaddam Indupriya | తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మాజీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Gaddam Indupriya | తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మాజీ కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ అందజేశారు.

Gaddam Indupriya | బాధ్యతతో నిర్వర్తిస్తాను..

ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలక లాంబ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. మహిళా సాధికారత కోసం, మహిళల హక్కుల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తూ మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతుండగా ఆయన సతీమణి గడ్డం ఇందుప్రియకు సైతం పార్టీలో సముచిత స్థానం లభించడం పట్ల జిసిఆర్ అనుచర వర్గంలో హర్షం వ్యక్తం అవుతోంది.

ఇది కూడా చదవండి..: Nandipet Students | డివిజన్ స్థాయి ప్రతిభాపోటీల్లో నందిపేట్​ విద్యార్థుల ప్రతిభ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *