Nimbachala Brahmotsavams | శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచల క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్‌: Nimbachala Brahmotsavams | మండలంలోని (Bheemgal) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచల క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వైదిక సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేపట్టారు.

Nimbachala Brahmotsavams | ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని..

ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ తొలుత స్వామివారి గర్భాలయంలో విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి పుణ్యహవచనం, రక్షాబంధనం, శ్రీమద్భగవద్గీత పారాయణం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పుట్టమన్ను సేకరించి ద్వాదశ పాత్రల్లో బీజాలను నాటారు. బీజాలు మొలకెత్తే ప్రక్రియతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, స్వామివారి కృపతో సకల శుభాలు కలగాలని ప్రార్థించినట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కుటుంబ సభ్యులు, అర్చక బృందం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TGSRTC Special Buses | కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *