Black Soil Mafia Remark | ‘నల్లమట్టి మాఫియా’ మాటను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలి

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Black Soil Mafia Remark | రైతుల కోసం నల్లమట్టిని తరలిస్తున్న వ్యాపారులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Mla Rakesh reddy) మాఫియాతో పోల్చడాన్ని రైతు నాయకులు తప్పు పట్టారు. ఆర్మూర్ (Armoor) ప్రెస్​క్లబ్​లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Black Soil Mafia Remark | రైతులకు లాభం..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నల్లమట్టిని తరలించే వ్యాపారులను మాఫియాతో పోల్చారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. మాఫియా అనే మాటను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరాం​సాగర్​ (Sriram sagar) నుంచి నల్లమట్టి తీయడం వల్ల రైతులకు లాభమని, వర్షాలు పడినప్పుడు అటు ప్రాజెక్టుకు మంచిదన్నారు. నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తే అధికారులతో టీంలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతు నాయకులు అంకాపూర్ దేవేందర్ రెడ్డి, మునిపల్లి చిన్న సాయి రెడ్డి, మంథని నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *