అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Congress Remarks | రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనడానికి ప్రతి రోజు తెలంగాణ భవన్లో చేరికలే నిదర్శనం అని చెప్పారు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి (Khairatabad constituency) చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్, ఇతర నాయకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన దానం నాగేందర్‌ను హైకోర్టు డిస్కాలిఫై చేసిందన్నారు. రేపో మాపో ఎన్నికలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తుందన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మల్లా కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటున్నారని చెప్పారు.
Harish Rao Congress Remarks | ఎమ్మెల్యేలు తిడుతుండటంతో..
సీఎం 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఓ ఎమ్మెల్యే అంటున్నారని, ఇంకో ఎమ్మెల్యే 20శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని అంటున్నారని చెప్పారు. వాళ్ల ఎమ్మెల్యేలే తిరగబడుతుంటే ఆయన అసహనానికి లోను అవుతున్నారని, అందుకే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నారని చెప్పారు. ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలన్నారు.
Harish Rao Congress Remarks | హైదరాబాద్ ఇమేజీ డ్యామేజీ
అభివృద్ధితో కేసీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచారని సీఎం అన్నారు. రేవంత్ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని డ్యామేజీ చేశారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో రోజుకు 80వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేరన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్ 10లక్షల సీసీ కెమెరాలు పెట్టించారని, అందులో 5లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి ఉందన్నారు. నగరంలో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు.
ఇది కూడా చదవండి..: Pension Bribe Case | పింఛన్ మంజూరు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి