అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Comments | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తన కూతురు కోసం ఇంటర్ విద్యను రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారన్నారు.
హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పింఛన్ల కంటే.. తొలగించిన పింఛన్లే ఎక్కువ అన్నారు. మూడేళ్లలో 4.71 లక్షల పింఛన్లను తొలగించిన కాంగ్రెస్, కొత్తగా 4.63 లక్షల పింఛన్లే ఇచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛన్ ఇస్తామన్న హామీని కూడా మరిచిపోయిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెబుతున్న సీఎం.. ముందుగా వారికి నెలకు రూ.2,500 చొప్పున జమ చేయాలని హితవు పలికారు.
KTR Comments | వరంగల్‌ను ఫ్యూచర్ సిటీ చేస్తాం
రేవంత్‌రెడ్డి వరంగల్‌కు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీ కోసం తాము భూములు సేకరిస్తే, దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఉన్న వరంగల్ అన్నారు. వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చిన సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం అమలు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంట్ లేవని, విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని విమర్శించారు.
KTR Comments | ఢిల్లీకి గులాంలు..
తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవ పోరాటం అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి గులాంలు అవ్వడం అవసరమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పులు మోస్తున్నారని, వాళ్ళకంటే చిన్న వయసున్న ఢిల్లీ నాయకుల కాళ్ళు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
దీనిని కూడా చదవండి : Paddy Farmers | వ్యవసాయ అధికారుల తప్పిదం.. రైతుల పాట్లు