అక్షరటుడే, కామారెడ్డి: Operation Kavach Inspection | జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ కవచ్ పనితీరుపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఆపరేషన్ కవచ్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Operation Kavach Inspection | నేర నియంత్రణ కోసం..
రాత్రి వేళల్లో జిల్లాలో నేర నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో సిబ్బంది ఎంతవరకు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారో ఎస్పీ స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తత, విధి నిర్వహణ తీరును గమనించారు. వాహనాల తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారు.. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. చెక్ పోస్టు వద్ద ఉన్న సౌకర్యాలు, సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కూడా ఆరా తీశారు. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వాహనాల తనిఖీల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
Operation Kavach Inspection | అనుమానాస్పద వ్యక్తులపై నిఘా..
రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎలాంటి సమాచారం అందినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నిరంతర నిఘానే నేర నియంత్రణకు కీలకమని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆపరేషన్ కవచ్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Road Accident | చెరుకు ట్రాక్టర్, కారు ఢీ.. ఒకరి మృతి