​Land Encroachment | భూకబ్జాలపై వృద్ధురాలి ఆవేదన.. ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు వినతి

తమ వారసత్వ భూమిని కబ్జా కోరల్లోంచి విడిపించాలని ఓ వృద్ధురాలు వేడుకుంటోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Land Encroachment | తమ వారసత్వ భూమిని కబ్జా కోరల్లోంచి విడిపించాలని ఓ వృద్ధురాలు వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్​ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసింది.

Land Encroachment | నిజామాబాద్​ రూరల్​లోని పాంగ్రా..

​నిజామాబాద్ (Nizamabad) రూరల్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన చింతకాయల రాజమణి మోకాళ్ల శస్త్రచికిత్స కారణంగా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కలెక్టరేట్‌కు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు. తన భర్త దివంగత చింతకాయల మల్లయ్య ద్వారా పాంగ్రా గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 444/అ/2/3, 444/ఆ/2, 444/అ లలో మొత్తం 1 ఎకరం 39 గుంటల భూమి వారసత్వంగా సంక్రమించిందని తెలిపారు. గత 50 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉండి, ప్రస్తుతం తన పేరుపై పట్టా ఉన్న ఈ భూమి హద్దుల నిర్ధారణ కోసం ప్రభుత్వానికి నిర్దేశిత రుసుము చెల్లించి పీడీ (PD) సర్వేకు దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు. ​

సంబంధిత అధికారులు ఇప్పటికే భూమిని సర్వే చేసినప్పటికీ, నాలుగు వైపుల హద్దులు, పూర్తి కొలతలతో కూడిన తుది సర్వే నివేదికను మాత్రం ఇంతవరకు అందజేయలేదని ఆమె వాపోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు భూకబ్జాలకు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని, తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి తుది సర్వే నివేదికను ఇప్పించి, తన భూమికి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

ఇది కూడా చదవండి..: Akula Kalpana Appointment | మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల కల్పన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *