అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం గ్యాపఅప్‌లో ప్రారంభమైనా.. ప్రాఫిట్ బుకింగ్‌తో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రపంచ మార్కెట్లనుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో ప్రధాన సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా బ్యాంకు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పైపైకి దూసుకువెళ్తూ నాలుగు వారాల్లో సుమారు 19 శాతం పెరిగిన బ్యాంక్ ఇండెక్స్.. సోమవారం 3 శాతానికిపైగా నష్టపోయింది.
Stock Market Crash | లాభాలతో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం ఆశావహ దృక్పథంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 502 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 241 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 2,267 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 63 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి అమ్మకాల ఒత్తిడితో 649 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 1,483 పాయింట్ల నష్టంతో 82,435 వద్ద, నిఫ్టీ 451 పాయింట్ల నష్టంతో 25,349 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,601 కంపెనీలు లాభపడగా 2,872 స్టాక్స్ నష్టపోయాయి. 265 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 132 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 169 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో, 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 3.47 శాతం, టెక్ మహీంద్రా 2.13 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.94 శాతం, టైటాన్ 1.93 శాతం, ఐటీసీ 0.74 శాతం లాభపడ్డాయి.
Top Losers : టాటా స్టీల్ 8.16 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.95 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.22 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.36 శాతం, ఎస్బీఐ 2.91 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Selloff | ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు