Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో పతనం ఆగడం లేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం ఆశావహ దృక్పథంతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ రక్తమోడుతున్నాయి.

Indian Stock Market | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 416 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 101 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,279 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 45 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 380 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 72,757 వద్ద, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో 22,474 వద్ద ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 5 స్టాక్స్ లాభాలతో, 25 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 2.06 శాతం, ఎటర్నల్ 1.75 శాతం, ఇన్ఫోసిస్ 1.02 శాతం, ఎల్టీ 0.68 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.14 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టాటా స్టీల్ 3.94 శాతం, అదానీపోర్ట్స్ 2.91 శాతం, టైటాన్ 2.51 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.49 శాతం, ట్రెంట్ 2.43 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Oct 23 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *