అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar | ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుపై బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం కరీంనగర్లో పర్యటించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. చొరబాటుదారుల ఓట్లను రక్షించాలని తాము అడగడం లేదన్నారు. అయితే దేశంలోకి అక్రమంగా చొరబాట్లు జరగుతుంటే, అడ్డుకోకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారన్నారు.
Ponnam Prabhakar | నిధులపై సమాధానం చెప్పాలి
కరీంనగర్‌కు వచ్చి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం కాదని, 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో యాత్రలు చేయడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. ఎస్ఐఆర్పై పార్లమెంటులో ప్రత్యేక చర్చకు సిద్ధం కావాలన్నారు.
ఇది కూడా చదవండి..: Khammam Road Accident | కారును ఢీకొన్న లారీ.. దంపతుల మృతి