Kamareddy SI Transfer | వీఆర్‌లోకి ఎస్సై..! క్రమశిక్షణ చర్యల్లో భాగమేనా..?

జిల్లా పోలీసు బాస్ మరోసారి కొరడా ఝుళిపించారా..? విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ ఎస్సైని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపించారా..?

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SI Transfer | జిల్లా పోలీసు బాస్ మరోసారి కొరడా ఝుళిపించారా..? విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ ఎస్సైని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపించారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Kamareddy SI Transfer | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..

జిల్లాలోని ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సదరు ఎస్సైని వీఆర్‌కు పంపించారన్న వార్త ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.గత కొంతకాలంగా జిల్లా పోలీసు శాఖకు సవాల్ విసురుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి భారీ చోరీలకు పాల్పడుతున్నారు. వీటికి నిఘా వైఫల్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిఘా వైఫల్యంపై పోలీస్ బాస్ అంతర్గత విచారణ చేపట్టారన్న ప్రచారం సాగుతోంది. ఫలితంగా సదరు ఎస్సై పనితీరుపై ప్రతికూల నివేదిక వెళ్లడంతో, వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ వీఆర్‌కు అటాచ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ బాధ్యతలను సమీపంలోని మరో ఎస్సైకి అప్పగించినట్లు తెలుస్తోంది.

Kamareddy SI Transfer | గాడిలో పెడుతున్న ఎస్పీ…

​జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కొందరు ఎస్సైలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పోలీసు శాఖను గాడిలో పెట్టిన ఆయన, ఆ తర్వాత కిందిస్థాయి సిబ్బందిపైనా కొరడా ఝుళిపించారు. చిన్నపాటి ఆరోపణలు వచ్చినా, ఎస్పీ పర్యటనల్లో పొరపాట్లు దొర్లినా వేటు తప్పదన్న హెచ్చరికలు జారీ చేసినట్లు అప్పట్లో శాఖలో చర్చ సాగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం మిగతా ఎస్సైలకు ఓ హెచ్చరికలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..: Police Sports | నేటి నుంచి రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు… అగ్నిమాపక శాఖ పటిష్ట బందోబస్తు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *