Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​పై పోలీసుల ఉక్కుపాదం.. 84 మందికి జరిమానాలు

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Drunk Driving | జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా జిల్లా (Kamareddy) పోలీస్ శాఖ డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లావ్యాప్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

Drunk Driving | మద్యం సేవించి వాహనాలు నడుపుతూ..

ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 84మందిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు మొత్తం రూ.1,66,100 జరిమానా విధించింది. అదేవిధంగా ఆరుగురికి ఒకరోజు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. గతంలో రెండుసార్లు మద్యం సేవించి వాహనం నడిపినందుకు డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదైనప్పటికీ, తన ప్రవర్తనలో మార్పు రాకుండా మూడోసారి కూడా అదే తప్పుకు పాల్పడుతూ పట్టుబడిన వ్యక్తికి కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం డ్రైవర్ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలకు కూడా పెను ముప్పుగా మారుతుందన్నారు.

Drunk Driving | క్షణిక ఆనందం కోసం..

క్షణిక ఆనందం కోసం చేసే చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుందని తెలిపారు. ఇంటి వద్ద తమ రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మద్యం సేవించినప్పుడు స్టీరింగ్ పట్టకుండా, సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: యాక్టర్ సరా అర్జున్..న్యూ లుక్ వీడియో వైరల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *