అక్షరటుడే, వెబ్డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో వెన్నంటే నిలిచిన వారిని కనీసం గుర్తించలేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం జిల్లాలో నిర్వహించిన టీజేఎస్ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Kodandaram TJS Meeting | ప్రసంగంలోని అంశాలు
తెలంగాణ సాధన కోసం అందరం కలిసి కట్టుగా పోరాడామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. భూసేకరణ బాధితులు, నిరుద్యోగులు, బీసీ రిజర్వేషన్లు, విద్య, వైద్యం,రైతుల సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్, నిమ్స్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.
Kodandaram TJS Meeting | రాజకీయాల్లో మార్పు రావాలి..
ప్రస్తుత రాజకీయాలు ప్రజల చుట్టూ కాకుండా డబ్బు, స్వార్థం చుట్టూ తిరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ప్రజా కేంద్రీకృత రాజకీయాలు జరగాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం తీరును తప్పుపట్టారు. అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, సారవంతమైన భూములు గల సంగారెడ్డి జిల్లా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నేతలు తుల్జా రెడ్డి, ఆశప్ప, సాయిలు, లక్ష్మి తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఇది కూడా చదవండి: China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

