క్రైంYellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

కామారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త హనుమాన్ మూల మలుపు (కళ్యాణి ప్రాజెక్టు) (Kalyani Project) సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

Yellareddy Road Accident | ధ్వంసమైన కారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) జిల్లా నస్రుల్లాబాద్​ గ్రామానికి చెందిన దండ్ల నాగరాజు హైదరాబాద్ (Hyderabad) నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు (Yellareddy Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, బోధన్​: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid...

Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ...

Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం...

Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు...