నిజామాబాద్Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్​ సీపీ సాయి చైతన్య సూచించారు. బోధన్ పట్టణంలో మైనార్టీ మత పెద్దలు, మసీద్​ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, బోధన్​: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid festival) శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బోధన్ (Bodhan) పట్టణంలోని లయన్స్ క్లబ్​లో మైనార్టీ మత పెద్దలు, మసీద్​ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం (peace meeting) నిర్వహించారు.

Bakrid Peace Meeting | శాంతి భద్రతల పరిరక్షణపై..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్​లో లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు. జిల్లాలో శాంతిపూర్వక వాతావరణం కొనసాగేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని సీపీ పేర్కొన్నారు.

ముస్లిం మత పెద్దలు సైతం పట్టణంలో శాంతిసామరస్యాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, బోధన ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్​హెచ్​వో వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూరు సీఐ శ్రీకృష్ణ, బోధన్ ఎస్సైలు మనోజ్, చంద్రమోహన్, ట్రాఫిక్ ఎస్సై మహేష్, కోటగిరి ఎస్సై సునీల్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇలియాస్​, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా, మైనార్టీ మత పెద్దలు ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

tyui

ఇది కూడా చదవండి: Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hantavirus WHO Alert | కొవిడ్​ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hantavirus WHO Alert | హంతా వైరస్ వ్యాప్తిపై...

Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Meena Driverless Taxi | వెండితెరపై తన నటనతో...

Bandi Sanjay | బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు : కేంద్ర మంత్రి బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | తమది దాడులు చేసే...

Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ...